సామ్రాజ్యవాద శక్తుల కంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదకరంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గాంధీభవన్‌లో ఇవాళ చేపట్టిన దీక్షను ఉద్దేశించి మాట్లాడిన ఆయన పోలీసు తీరుపై విరుచుకుపడ్డారు. పోలీసులు, కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యాత్రకు భయపడే పోలీసులు, కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ర్యాలీకి ఇబ్బంది లేని మార్గాన్ని సూచించాలని కోరినా... పోలీసు శాఖ స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ దేశంలో అలజడులు జరిగలేదని, భాజపా అధికారంలోకి రావడానికి తెరాస, ఎంఐఎం కూడా కారణమేనని విమర్శించారు. తెరాస, ఎంఐఎంల పునాదులు కదిలించాల్సి ఉందని... లేదంటే లౌకిక వాదులు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామాన్ని కదిలించి ప్రజల గుండె చప్పుడు వినిపిస్తామని.. అప్పుడు ఏలా అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్ ఖాన్