పోలీసులతో మిలియన్ మార్చ్ ను అడ్డుకునేందుకు తెరాస ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించి విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్న భట్టి... ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించారు. శాంతియుతంగా కార్మికులు నిరసన తెలుపుతుంటే... అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో అడ్డుకునే వికృతచర్యకు ప్రభుత్వం దిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మిలియన్ మార్చ్‌కు అనుమతిస్తే... ప్రస్తుత సర్కారు మాత్రం పోలీసులను అడ్డు పెట్టుకొని నిరసనలను అణగదొక్కుతోందని విరుచుకుపడ్డారు. అయోధ్యలో వివాదాస్పద స్థల వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భట్టి స్వాగతించారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం