ETV Bharat / state

సీజేఐగా జస్టీస్ ఎన్వీ రమణ కావడం శుభపరిణామం: భట్టి - clp leader batti vikramarka on cji nv ramana

సీజేఐగా జస్టీస్ ఎన్వీ రమణ కావడం దేశానికి శుభపరిణామమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీరమణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

clp batti vikramarka, justice nv ramana
సీజేఐగా జస్టీస్ ఎన్వీ రమణ కావడం శుభపరిణామం: భట్టి
author img

By

Published : Apr 6, 2021, 2:17 PM IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగు వ్యక్తి.. జస్టిస్ ఎన్వీరమణకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సీజేఐగా జస్టీస్ ఎన్వీరమణ రెండో తెలుగు వ్యక్తి కావడం తెలుగు ప్రజలంతా హర్షించదగ్గ విషయంగా భట్టి కొనియాడారు. పేదల పక్షపాతి, సామాజిక స్పృహ కలిగిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం దేశానికి శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, ఉమ్మడి ఏపీహైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో న్యాయమూర్తిగా.... ఎన్నో కీలకమైన కేసులను విచారించిన ఉన్నత వ్యక్తిగా కొనియాడారు.

రాజ్యాంగం, నేర ఘటనలు, సేవలు, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలకు చెందిన కేసుల్లో జస్టీస్‌ ఎన్వీర‌మ‌ణ సిద్ధహస్తుడని తెలిపారు. జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ సార‌థ్యంలో మ‌రింత వేగవంతంగా కేసులు పరిష్కారమై ప్రతి ఒక్కరికీ న్యాయం జ‌ర‌గాల‌ని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.