కరోనా మహమ్మారి భాగ్యనగరంలో రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. నగరంలో వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు వీధుల్లో కర్రలు, ముళ్ల కంపలు, నీటి డ్రమ్ములతో రోడ్లు మూసివేస్తున్నారు. అంబర్‌పేట తిలక్ నగర్ చే నంబర్ తదితర ప్రాంతాల్లో ఇలా కర్రలు, తాళ్లతో దారులు మూసివేశారు. దీనితో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు బయట వ్యక్తులు తమ కాలనీల్లోకి రాకుండా ఉండేలా రోడ్లు మూసివేయడం మంచిదే అయినా.. అత్యవసర పరిస్థితుల్లో అవే సమస్యలు తెచ్చిపెడ్తాయి. ఇది ఆలోచించకుండా ప్రజలు వారికి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా రోడ్లు మూసివేయడం వల్ల అంబులెన్సులు ఆగిపోయిన సంఘటనలు తెలిసిందే.
అయితే ఇలా రోడ్లు మూయకుండా వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం, స్వీయ నియంత్రణను పాటించాలని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా కొత్తవారు వస్తే తమకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు.
ఇదీ చదవండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు