ETV Bharat / state

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ - actor shravani murder case latest update

closing-custody-for-accused-in-actor-shravani-suicide-case
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ
author img

By

Published : Sep 27, 2020, 5:33 PM IST

Updated : Sep 27, 2020, 7:19 PM IST

17:30 September 27

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితులుగా ఉన్న సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్​ లను లోతుగా విచారించిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఇద్దరి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. శ్రావణి-దేవరాజ్​ల ఫోన్ కాల్స్​ రికార్డులకు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించారు. శ్రావణి ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలపై మరోమారు ఇద్దరి స్టేట్​మెంట్​లను రికార్డు చేశారు.

ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి ఇంట్లో సాయికృష్ణా రెడ్డి ప్రవర్తించిన తీరుపై పోలీసులు అతడిని ఆరా తీశారు. ఈనెల 7న దేవరాజ్-శ్రావణి కలుసుకున్న బేగంపేటలోని రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. జరిగిన పరిణామాలపై మరోసారి  విచారించారు. పూర్తి స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు. ఈ మేరకు నిందితులను రేపు న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.

ఇదీ చూడండి: క్రైం థ్రిల్లర్: బుల్లితెర నటి ఆత్మహత్యకు కారణమేంటి?

Last Updated : Sep 27, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.