ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్లాస్4 ఉద్యోగులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర క్లాస్4 ఉద్యోగుల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే స్వరాష్ట్రంలో పనిచేసుకోవచ్చని.. తాము ఉద్యమ సమయంలో ముందుండి పోరాడామని... ఇప్పుడా ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు లాక్డౌన్ వల్ల అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏపీలో పనిచేస్తున్న 400 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.