MP PV Midhun reddy: ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లిలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఓ వ్యక్తి తన సమస్యను ఎంపీ పరిష్కరిస్తారనే ఆశతో వెళ్లాడు. కాని అతన్ని మెడపట్టి గెంటేశారు. ఎందుకంటే.. ఒకప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 300 మంది కార్మికులకు ఇంటి పట్టాలు మన ప్రభుత్వం మంజూరు చేసిందని పట్టాలు ఇచ్చారు.
కానీ స్థలం చూపించలేదంటూ ప్రకాష్ అనే వ్యక్తి ఎంపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా, అతన్ని పోలీసులు ఆ పార్టీ నాయకులు మెడబెట్టి గెంటిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో జరిగింది. బుధవారం మదనపల్లిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని గుండు వీధిలో శుద్ధి నీటి ప్లాంటును ఎంపీ ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఎంపీ కార్యక్రమానికి వెళ్లిన ప్రకాష్ ఆవేదనతో ఒకప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 300 మంది కార్మికులకు ఇంటి పట్టాలు మన ప్రభుత్వం మంజూరు చేసిందని పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపించలేదంటూ తన సమస్యను ఎంపీ ముందు ఆవేదనతో కొంచెం గట్టిగానే వక్కాణించాడు. దీంతో అది గమనించిన పార్టీ నాయకులు, పోలీసులు అతన్ని కార్యాలయం లోపల నుంచి మెడ పట్టుకొని బయటకు నెట్టుకుంటూ వచ్చారని వాపోయాడు.
ప్రకాష్. పరిస్థితి కొెెంచెం ఆందోళనకరంగా మారడంతో చివరకు ఎంపీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఎంపీ ముందు తన సమస్యను చెప్పుకుందామని అనుకున్న ప్రకాష్ కు చివరకు నిరాశ మిగిలింది.
ఇవీ చదవండి: