ETV Bharat / state

CJI justice nv ramana news: ఆకాశమే హద్దుగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి: సీజేఐ

ఆంధ్రప్రదేశ్​లోని పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (CJI justice nv ramana news)... విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.

CJI justice nv ramana news
CJI justice nv ramana news
author img

By

Published : Nov 22, 2021, 2:07 PM IST

Updated : Nov 22, 2021, 5:28 PM IST

విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (CJI justice nv ramana news) అన్నారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్నాతకోత్సవంలో సీజేఐ చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.

ఈనాటి నా పదవులు, గౌరవానికి ఆయన ఆశీస్సులే కారణం..

పతకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు. విద్యార్థి దశలో కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి. నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరం. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి ఈ వర్సిటీ ప్రతీక. ఆధునిక గురుకులాలకు ఇది ఆదర్శ నమూనా. సత్యసాయి ప్రవచించిన ప్రేమను సమాజానికి, పర్యావరణానికి, భూమాతకు మనం అందించాలి. ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం. సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఎక్కడికెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవసరముంది.

సీజేఐ, జస్టిస్ ఎన్వీ రమణ

అవలక్షణాలను సరిచేసుకోవాలి..

రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెద్దలను గౌరవిస్తున్నారా అనేది పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను బాగా చూసుకుంటున్నారా? లేదా? బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా? అనేది ఆలోచించాలని సూచించారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయని వెల్లడించారు. అవలక్షణాలను సరిచేసుకుని మంచిపాలన అందించాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

CJI justice nv ramana news: ఆకాశమే హద్దుగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి: సీజేఐ

ఇదీ చదవండి: three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

Last Updated : Nov 22, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.