ETV Bharat / state

మనసుకు నచ్చిన రంగంలో ఉండాలనే ఉద్యోగం వదిలి.. సివిల్స్​ వైపు - సివిల్స్​

తండ్రి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్.. తల్లి సాధారణ గృహిణి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చదివి.. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదివారు. మొదటి సారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ కూడా దాటలేదు. రెండో సారి పట్టుదలతో.. జాతీయ స్థాయిలో 170వ ర్యాంకు సాధించారు.. ప్రేమ్ సాగర్. భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందన్న అబ్దుల్ కలాం మాటలు.. తనను అంతర్జాతీయ అంశాలపై ఆసక్తి పెంచాయని.. దాంతో ఐఎఫ్ఎస్ అధికారి కావాలన్న ఆకాంక్ష.. ఇవాళ సివిల్స్ విజేతగా మార్చాయంటున్న ప్రేమ్​సాగర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

civils-ranker-premsagar-interview
మనసుకు నచ్చిన రంగంలో ఉండాలనే ఉద్యోగం వదిలి.. సివిల్స్​ వైపు
author img

By

Published : Aug 5, 2020, 5:15 AM IST

మనసుకు నచ్చిన రంగంలో ఉండాలనే ఉద్యోగం వదిలి.. సివిల్స్​ వైపు

వ్యక్తిగత, కుటుంబ నేపథ్యం..

మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం. మాది మధ్య తరగతి కుటుంబం. పదేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాం. నాన్న మార్కెటింగ్ రిప్రజెంటేటివ్. అమ్మ సాధారణ గృహిణి. చెల్లెలు సాహితి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ పాఠశాలలు మారాను. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివారు. తర్వాత శ్రీనిధిలో బీటెక్ చేశాను. చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్​నే..మెరిట్ స్టూడెంట్​ను కాదు.

కలాం మాటలు కదిలించాయి..

క్యాంపస్ సెలెక్షన్ లో కాగ్నిజెంట్​లో ఉద్యోగం వచ్చింది. రోజుకు మూడున్నర గంటల ఖాళీ సమయం ఉండేది. ఖాళీ సమయంలో ఇంకా ఏదైనా చేయవచ్చునా అని ఆలోచించాను. భారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతుందన్న అబ్దుల్ కలాం వాక్యాలు ఆకర్షించాయి. ఆ తర్వాత పత్రికల్లో అంతర్జాతీయ కథనాలు ఎక్కువగా చదవడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి కావాలనే కోరిక మొదలైంది. దాని కోసం సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను.

మొదటిసారి ఫెయిలయ్యాను.

కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కొన్నాళ్లు ఉద్యోగం కొనసాగించాల్సి వచ్చింది. 2018 జనవరిలో ఉద్యోగం మానేశాను. అదే ఏడాది సివిల్స్ పరీక్ష రాశాను. అయితే ప్రిలిమ్స్ ఫెయిలయ్యాను. మళ్లీ ప్రయత్నం ప్రారంభించాను. మొదటి సారి చేసిన ప్రయత్నం, కోచింగ్ ఉపయోగపడింది. రోజూ టెస్టు రాశాను. అలా 70 టెస్టులు రాశాను. రోజూ ఉదయం టెస్టు రాయడం.. వాటిని విశ్లేషించుకొని.. మెరుగుపరుచుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్​లో పాస్ అయితే ఓకే, లేకపోతే మళ్లీ ఉద్యోగం చేయమని ఇంట్లో అన్నారు. పొలిటికల్ సైన్స్ ఆప్షన్​గా తీసుకున్నాను.

ఇంటర్వ్యూలో నిజాయతీ, విశ్వాసం కీలకం

ఇంటర్వ్యూ చాలా కీలకం. నిజాయతీ, విశ్వాసం చాలా అవసరం. నిరాశ, నిస్పృహకు లోను కావద్దు. చెబుతున్న అంశం చూడరు.. సొంతంగా ఆలోచిస్తున్నారా లేదా అని గమనిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిర్ణయానికి కట్టుబడి ఉండే శక్తి ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తారు. కాబట్టి రోజూ ఎడిటోరియల్స్ చదివి.. కొద్ది సేపు కళ్లు మూసుకొని.. ఆ అంశాన్ని సొంతంగా ఆలోచిస్తూ ప్రిపేర్ అయ్యాను.

సంతృప్తిగానే ఉంది..కానీ

ప్రస్తుతం ర్యాంకు 99 శాతం సంతృప్తిగా ఉంది. ఇంకొంచెం మంచి ర్యాంకు వస్తే బాగుండేదనే ఒక శాతం అసంతృప్తి ఉంది. ఐఎఫ్ఎస్ లేదా ఐఏఎస్ వస్తే చేరుతా. లేదంటే.. మళ్లీ పుస్తకాలు పడతా. మరోసారి ప్రయత్నిస్తా.

ఇవీ చూడండి: సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. 36 మంది ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.