Civils Preliminary Examination: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు యూపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకెళ్లాలి.
సుమారు 25 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడుతాయని యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబరులో మెయిన్స్ పరీక్షలు జరగుతాయి.
ఇదీ చూడండి..