నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌరసరఫరాల శాఖ హైకోర్టుకు నివేదిక అందజేసింది. రాష్ట్రంలో 20,530 తనిఖీలు చేసి.. 1166 కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల కమిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై రూ.33.50లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.
లీగల్ మెట్రాలజీ 2,258 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయిస్తున్న వారిపై రూ.76.98 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ నివేదికను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.