ETV Bharat / state

బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేని వాళ్లకు తపాలా ద్వారా నగదు - money trancefer

రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలున్న రేషన్ కార్డు దారులకు 1500 రూపాయల చొప్పున రూ. 1,112 కోట్లు ఖాతాలో జమ చేశామని పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేని వాళ్లకు తపాలా ద్వారా నగదు అందిస్తామని చెప్పారు.

civil supply corporation chairman srinivas reddy on money trancefer
బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేని వాళ్లకు తపాలా ద్వారా నగదు
author img

By

Published : Apr 18, 2020, 8:36 PM IST

రాష్ట్రంలో రెండో విడతలో 3.12 లక్షల మంది వలస కార్మికులను ప్రభుత్వం గుర్తించిందని.. వారికి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయలు పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రూ. 12 కోట్ల విలువ చేసే 3746 మెట్రిక్ టన్నుల బియ్యం, రూ. 15.60 కోట్లు నగదును అందించనున్నట్లు చెప్పారు.

బ్యాంకు ఖాతా వివరాలు ఉన్న 74,07,186 కుటుంబాలకు రూ. 1500 చొప్పున రూ. 1,112 కోట్లు ఖాతాలో జమ చేశామని వెల్లడించారు. ఏప్రిల్​లో మొత్తం 15.63 లక్షల పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయని.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3.40 లక్షలు, మేడ్చల్ 2.33 లక్షలు, రంగారెడ్డి 1.65 లక్షలు, వరంగల్ 72 వేలు రేషన్ పోర్టబిలిటీని ఉపయోగించారని తెలిపారు.

బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేని 5,21,641 మందికి తపాలా ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. ఇందురుక సంబంధించిన రూ.78,24, 55,500 పోస్ట్ మాస్టర్ జర్నల్, హైదరాబాద్ ఖాతాలో జమ చేశామన్నారు. కందిపప్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని.. కందిపప్పు రాగానే అందరికీ అందిస్తామన్నారు.

ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.