ETV Bharat / state

'ఖరీఫ్​లో రికార్డుస్థాయి ధాన్యం దిగుబడి అవుతుంది'

దేశంలో ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

'ఖరీఫ్​లో రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి అవుతుంది'
author img

By

Published : Nov 15, 2019, 10:58 AM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల విద్యుత్​, రైతుబంధు వంటి పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పటిష్ఠ నిఘా

పక్క రాష్ట్రాలకు చెందిన దళారులు, వ్యాపారులు... రైతుల పేరుతో తెలంగాణలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సరిహద్దులో పటిష్ఠ నిఘాతో దీన్ని ఆరికట్టాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.

3,406 కేంద్రాలు

తెలంగాణ రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు అందుబాటులో ఉండేలా 3,406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అవగాహన అవసరం

రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తేమశాతాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.

TG_Hyd_63_14_Civil_supply_Chairman_AV_3038200 Reporter: Mallik Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం గింజలకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల కరెంట్ రైతుబంధు వంటి పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగి ఈ ఖరీఫ్‌లో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి కానుందని అయన పేర్కొన్నారు.పక్క రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో కొంతమంది దళారులు వ్యాపారులు రైతుల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని ఆరికట్టాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పౌరసరఫరాల అధికారులకు ఛైర్మన్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర రైతుకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండేలా 3406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 1447కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 36862 మంది రైతుల నుంచి 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని వివరించారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తేమ శాతాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.