ETV Bharat / state

"ఖరీఫ్​లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి" - akun sabrawal on karif season

ప్రభుత్వ చర్యల వల్ల ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆశాఖ కమిషనర్​ అకున్​ సబర్వాల్​ అన్నారు. ఖరీఫ్​ సీజన్​లో 60 నుంచి 65 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

'ఖరీఫ్​లో 60లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొంటాం'
author img

By

Published : Oct 30, 2019, 9:35 PM IST

'ఖరీఫ్​లో 60లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొంటాం'

ఈ ఏడాది ఖరీఫ్​లో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కారణంగా పంట దిగుబడి భారీగా పెరిగిందన్నారు. ప్రతిగింజా కొనుగోలు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు.

60 నుంచి 65 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ అకున్​ సబర్వాల్​ పేర్కొన్నారు. ఇప్పటికే 300 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. మరో 20 రోజుల్లో పూర్తిస్థాయి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 16 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా కనీస మద్దతు ధరకు వరి ధాన్యం పేరిట కరపత్రాన్ని ఛైర్మన్, కమిషనర్ ఆవిష్కరించారు.

ఇవీచూడండి: శివానుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.