ETV Bharat / state

'దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లోకి నగదు' - state civil supply chairman maareddy srinivas reddy

కనీస మద్దతు ధర చెల్లింపులో నిర్లక్ష్యం చేయకూడదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా కొనుగోళ్లు వివరాలను ఆన్‌లైన్‌ ప్రొక్యూర్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఓపీఎంఎస్‌)లో నమోదు చేయాలని సూచించారు.

state civil supply chairman maareddy srinivas reddy
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
author img

By

Published : Apr 19, 2021, 6:48 PM IST

రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని... అత్యంత ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేయాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా..

ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు నిధుల కొరత లేకుండా 20 వేల కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్‌ పౌరసరఫరాల సంస్థకు సమకూర్చారని తెలిపారు. రైతులకు తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్‌ ప్రొక్యూర్​మెంట్ మేనేజ్​మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్‌)లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని చెప్పారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం దిగుబడిని బట్టి...

రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 16 జిల్లాల్లో 1,377 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా... అందులో నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 744 కేంద్రాల్లో 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ధాన్యం దిగుబడి బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న దృష్ట్యా స్థానిక పరిస్థితుల ఆధారంగా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు చెప్పారు. యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

ఇదీ చదవండి: పాము, శునకం మధ్య ఫైట్​.. చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.