కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు.. కుటుంబసభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. కొవిడ్ మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న ఎర్రగడ్డ శ్మశానవాటికను ఆయన సందర్శించారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
మృతుల కుటుంబసభ్యులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కార్యక్రమాన్ని జరిపించాలని.. వాటిక నిర్వాహకులకు, జీహెచ్ఎంసీ అధికారులకు అంజనీకుమార్ సూచించారు. వాటికల వద్ద ఎలాంటి గొడవ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.
ఇదీ చదవండి: సబ్బం హరి పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు