ఈ ఏడాది హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ హైదరాబాద్‌గా మారుస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మేయర్‌తో పాటు కమిషనర్ దానకిశోర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఐదేళ్లలో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు రామ్మోహన్ తెలిపారు. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
కోటి మొక్కలు నాటుతున్నాం
ఈ ఏడాది మొదటి దశలోనే కోటి మొక్కలు నాటుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ అన్నారు. ప్రతి ఒక్కరు కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి : మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం కేసీఆర్