ETV Bharat / state

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ - Citu

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వేలను ప్రైవేటీంచకుండా ఆపాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ
author img

By

Published : Aug 8, 2019, 5:33 PM IST

దేశంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే ప్రైవేటీకరణ చేయటం దారుణమన్నారు సీఐటీయూ నేతలు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో 70 రైల్వే స్టేషన్లను, వర్క్ షాప్​లను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇకమీదట పేదలకు రైల్వే ప్రయాణం భారం కానుందని వెల్లడించారు. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే పదివేల కోట్ల లాభాలను ఆర్జించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయాలనుకోవడం దారుణమని విమర్శించారు.

కార్పొరేట్ శక్తుల కోసమే రైల్వేల ప్రైవేటీకరణ

ఇవీచూడండి: పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Vamshi Secunderabad..సికింద్రాబాద్.. యాంకర్.దేశంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు .కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సి.ఐ. టి.యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ..ఈ సందర్భంగా సి ఐ టి యు అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మొదటగా ప్రైవేటీకరణ చేసిన అనంతరం దేశంలో మిగిలిన 70 రైల్వే స్టేషను వర్క్ షాప్ లను కూడా ప్రైవేటు కన్నా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు రైల్వేలు ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలకు ప్రయాణికులకు సబ్సిడీ కూడ ఎత్తు వేస్తారని తెలిపారు గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే పదివేల కోట్ల లాభాలను ఆర్జించినప్పటికి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయాలనుకోవడం దారుణం అన్నారు..మోడీ సర్కార్ దేశంలోని పెట్టుబడిదారులకు ప్రైవేట్ రంగానికి బాటలు వేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలు నష్టపోయే అవకాశం ఉందన్నారు..రైల్వేలను ప్రైవేటీకరించే చేయకుండా ఆపాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని రైల్వే ప్రైవేటీకరణ కాకుండా రక్షించుకుంటామని స్పష్టం చేశారు..బైట్ ఈశ్వరరావు సిఐటియు ప్రెసిడెంట్ 2.మహేందర్ డివైఎఫ్ఐ నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.