ETV Bharat / state

కార్మిక సమస్యల పరిష్కారానికి 8న సీఐటీయూ సమ్మె - సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గం సమావేశం

రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ పరిశ్రమల కార్మికుల స్థితిగతులపై కేటీఆర్‌ వ్యాఖ్యలు డొల్లతనమని సీఐటీయూ నేతలు మండిపడ్డారు (citu comments on ktr). మండలి సమావేశాల్లో పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారని... అవన్నీ అవాస్తవమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు (CITU State Working Committee press meet).

citu
citu
author img

By

Published : Oct 6, 2021, 8:36 PM IST

రాష్ట్రంలో శ్రమ గౌరవాన్ని (డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌) కాపాడుతున్నామని, ఏ సమస్యలూ లేవని, సీఐటీయూకు పనిలేదని మంత్రి కేటీఆర్​ అనడం... హాస్యాస్పదంగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు (CITU State Working Committee press meet). కార్మిక హక్కుల పునరుద్ధరణ, కనీస వేతనం సవరింపు తదితర సమస్యలపై ఈనెల 8న రాష్ట్ర సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత నెలలో 22 రోజుల పాటు సీఐటీయూ నాయకత్వ బృందం చేసిన పాదయాత్రలో... కార్మికుల జీవన స్థితిగతుల గురించి అనేక దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఇవేవీ రాష్ట్ర పాలకులకు తెలియనట్లు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి, సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

యూనియన్లు ఏర్పడకుండా యాజమాన్యాలతో కుమ్మక్కై

స్థానిక కార్మికులకు ప్రమాదం జరిగితే బయటకు పొక్కకుండా దాచలేరనీ, యూనియన్లు, స్థానిక ప్రజల పోరాడటంతో ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులను పట్టించుకునే దిక్కులేదని పేర్కొన్నారు. ఇప్పటికే రెగ్యులర్‌ కార్మికులున్న కంపెనీల్లో వారిని తొలగించి, సెటిల్మెంట్‌ చేసిచేసి పంపుతున్నారని వివరించారు. యాజమాన్యాల ఆగడాలకు పాలకపార్టీల నాయకులు కూడా అండగా ఉంటున్నారని... ఆయా కంపెనీల్లో రకరకాల కాంట్రాక్టులు పొంది, యూనియన్లు ఏర్పడకుండా యజమానులకు సహాయపడుతున్నారని ఆరోపించారు.

ఇదే జరిగిదే యాజమాన్యాల దోపిడీకి హద్దు ఉండదు

రాష్ట్రంలో పదేళ్లకుపైగా కనీస వేతనాలు సవరించలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.వీరయ్య అన్నారు. 73 షెడ్యూల్డు పరిశ్రమల పరిధిలో కోటికి పైగా కార్మికులున్నారని... చట్ట ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి సవరించకపోవడం వల్ల రాష్ట్రంలో కార్మికులు ఇప్పటికే సుమారు రూ.17 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. మోడీ ప్రభుత్వం పలు కార్మిక చట్టాలను రద్దు చేసిందని, యాజమాన్యాల దోపిడీకి, ఆగడాలకు ఇక హద్దు ఉండదన్నారు. అందువల్ల కనీసవేతనాల సవరణ కోసం, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర కార్మికవర్గం అక్టోబర్‌ 8న సమ్మెకు సన్నద్ధమవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: SRINIVAS GOUD: నేటినుంచి సాంస్కృతిక శాఖ బతుకమ్మ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.