కేంద్ర ప్రభుత్వం కార్మిక, వ్యవసాయ రంగాలతో పాటు ప్రజా వ్యతిరేక బిల్లులను ఉపసంహరించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద పలు సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులు నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ ఆపాలని.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి.
ఇదీ చూడండి: సరిహద్దుల్లో వంతెనలను ప్రారంభించనున్న రాజ్నాథ్