సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అల్లె నాగేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లుగా మధ్యప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న అతను పెళ్లి కోసం సెలవుపెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నెల 13న వివాహానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లలో ఉండగా నాగేందర్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంట్లో విషాదం
వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గండెలవిసేలా విలపించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి:'ప్రియుడి కోసం టవరెక్కింది'