ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో గోడౌన్​లుగా మారిన సినిమా థియేటర్లు - కళ్యాణ మండపాలుగా థియేటర్లు

వెండి తెరపై చిత్రం ఆడేది ఎప్పుడో అన్న సందేహం నెలకొంది. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడిన కారణంగా.. యజమానులు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. థియేటర్లు తెరిచినా... నిర్వహణ ఖర్చులు పెరగటం, ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రమే ఉంటుందన్న అనుమానాలతో ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెడుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ : గోడౌన్​లుగా మారిన సినిమా థియేటర్లు

author img

By

Published : Jul 6, 2020, 5:24 PM IST

వెండి తెర మూగబోయింది. థియేటర్​ల్లో బొమ్మ పడి 105 రోజులు దాటేసింది. ఈ ఏడాది మార్చి 24న మొదలైన లాక్​డౌన్​ వల్ల మూతపడిన సినిమా థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. అభిమాన హీరోల చిత్రాల విడుదల వేళ.. పెళ్లి వేడుకలా కళకళలాడే థియేటర్లు.. నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన అన్​లాక్​ 2.0 మినహాయింపుల్లో థియేటర్లకు స్థానం దక్కలేదు. 3 నెలలుగా థియేటర్లు మూతపడిన కారణంగా.. యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ప్రత్యామ్నాయంగా..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాంతో కలిపి.. 12 థియేటర్లు ఉన్నాయి. ఉపాధి లేక వీటిల్లో 8 థియేటర్లను గోడౌన్లు, సమావేశ మందిరం, కల్యాణ మండపాలుగా మారుస్తున్నారు. భవిష్యత్​లో సినిమాలు ప్రదర్శించినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్ల సంఖ్య కుదింపు.. ఇతర సౌకర్యాల కల్పనకు ఖర్చు పెరిగిపోతుందని యజమానులు ఈ మార్గం ఎంచుకుంటున్నారు. థియేటర్లకు గతంలో మాదిరి ప్రేక్షకులు రారని, అయినా నిర్వహణ ఖర్చులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అందువల్లే టాకీస్​లను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.