ETV Bharat / state

Cine Writer Suspicious Death in Hyderabad : వందల కథలు రాసి.. 'ఒకే ఒక్క ఛాన్స్'​ కోసం ఎదురుచూసి..! - సినీ రచయిత అనుమానాస్పద మృతి కేసు

Cine Writer Suspicious Death at Shakepet Hyderabad : సినిమానే జీవితం అనుకున్నాడు.. ఎన్నో కథలు రాశాడు.. నిజ జీవితాలను చూస్తూ.. ఎన్నో పాత్రలు సృష్టించాడు. తాను రాసుకున్న కథలను వెండి తెర మీద చూసి మురిసిపోదాం అనుకున్నాడు. కానీ కాలం అతని ఆశలను కాటేసింది. పరిస్థితులు కలిసి రాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. వందలాది కథలు రాసుకున్న అతని 'కథ' అర్ధాంతరంగా ముగిసింది. అసలేం జరిగిందంటే..!

Cine Writer Suspicious Death in Hyderabad

author img

By

Published : Jun 18, 2023, 1:28 PM IST

Cine Writer Suspicious Death at Film Nagar : సినిమానే జీవనం అనుకుని తన జీవితం మొదలుపెట్టాడు. ఎన్నో సినిమా కథలు రాశాడు. నిజ జీవితాలను చూస్తూ.. దానికి తగ్గట్టుగా కథలో ఎన్నో పాత్రలను సృష్టించాడు. పాత్రలు ఏవైనా.. ఓ రచయితగా ప్రాణం పెట్టి రాసి వాటికి జీవం పోశాడు. తాను రాసుకున్న కథలను వెండి తెర మీద చూసుకుని మురిసిపోదాం అని అనుకున్నాడు.

Cine Writer Suspected Death News : ఒక్క ఛాన్స్.. అంటూ ఆ కథా రచయిత సినిమా ఆఫీస్​ల చుట్టూ తిరిగాడు. వందలాది కథలు రాసుకొని ఒక్క అవకాశం రాకపోదా అని ఎదురు చాశాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదన్న బాధతో 'ఇక అంతా అయిపోయింది'.. అనుకొని డిప్రెషన్​లోకి వెళ్లాడు. వందలాది కథలు రాసుకుని.. తన 'కథ'ను అర్ధాంతరంగా ముగించుకున్నాడు. గది నిండా కథలు.. మది నిండా ఆశలు.. ఇంతలో ఏమైందో ఏమో గానీ అనుకొని రీతిలో గదిలో మృతి చెంది ఉన్నాడు ఓ సినీ కథా రచయిత. చివరకు మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకూ ఎవరూ లేకపోవడంతో మార్చురీకి తరలించారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్​ నగరానికి వచ్చాడు. షేక్​పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్​లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున టెర్రస్​పై విగత జీవిగా కనిపించాడు. ఇది గమనించిన స్నేహితుడు 108కు సమాచారం అందించాడు. వారు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

Cine Writer Death Case : గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్​లోకి వెళ్లాడు. దీంతో స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది సినిమా కథల పుస్తకాలు గది నిండా ఉన్నాయి. ఆ సినిమా కథలు పుస్తకాలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.