గాలి ద్వారా వచ్చే వైరస్‌లను, బ్యాక్టీరియాలను పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన గాలిని అందించే వోల్ప్ ఎయిర్ మాస్కును హైదరాబాద్‌కు చెందిన తారదిద్దుల్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయన తయారు చేసిన ఈ పరికరాన్ని ప్రముఖ సినీనటి అర్చన ఆవిష్కరించారు.
ఇంటి గదిలోకి, కార్యాలయాల్లోకి, వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిడ్‌ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్‌ను, బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి స్వచ్చమైన గాలిని అందిస్తుందని సంస్థ సీఈఓ జగదీష్ తెలిపారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు