ETV Bharat / state

'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..' - ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో ప్రముఖ పాప్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ భేటీ

పబ్​లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పేమీ లేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. అతని వెంట తానుంటానని హామీ ఇచ్చారు. పది మందితో కలిసి ఒక్కడిపై దాడి చేయడం దారుణమన్నారు.

prakash raj support to rahul sipligunj
'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..'
author img

By

Published : Mar 9, 2020, 5:02 PM IST

అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్, ప్రముఖ పాప్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. ఓ కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసమే... ఆయనను కలిసినట్లు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత పని మీదే వినయ్ భాస్కర్​ను కలవడానికి వచ్చినట్లు తెలిపారు.

ఇటీవలే పబ్​లో రాహుల్ సిప్లిగంజ్​పై జరిగిన గొడవ గురించి కూడా ఆయన స్పందించారు. రాహుల్​కు అన్యాయం జరిగిందని... అతని వెంటే తానుంటానంటూ సినీనటుడు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. పోలీస్ ఉన్నతాధికారులతోనుూ మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పబ్​లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీలేదన్నారు. అతని తప్పు లేనపుడు ఎందుకు రాజీపడాలని ప్రశ్నించారు. పబ్​కు వెళ్లడం తప్పు కాదని... కానీ పది మందితో కలిసి ఒక్కరిని కొట్టడం దారుణమని ప్రకాష్ రాజ్ తెలిపారు.

'రాహుల్ తప్పేమీ లేదు.. తన వెంట నేనుంటా..'

ఇవీ చూడండి: మారుతీరావుకు తలకొరివి పెట్టిన తమ్ముడు శ్రవణ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.