భారత సిమెంట్ రంగం ఇప్పటికే స్వయం సమృద్ధిగా ఉందని సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఛైర్మన్, దాల్మియా సిమెంట్ ఎండీ, సీఈఓ.. మహేంద్ర సింగి తెలిపారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ), సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) సంయుక్తంగా మొదటి సారిగా ఆన్లైన్లో నిర్వహిస్తోన్న మూడు రోజుల 16వ గ్రీన్ సిమెంట్ టెక్ 2020 కాన్ఫరెన్స్ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
ప్రభుత్వ మద్దతుతో పాటు సరైన విధానాల వల్ల భవిష్యత్లో సిమెంటు ఉత్పత్తి పెంచుకోగలదన్నారు. వచ్చే 20 ఏళ్లలో అర్బనైజేషన్ రెట్టింపు అవుతుందన్నారు. దీనివల్ల హౌసింగ్, మౌలిక సదుపాయాలు, సిమెంట్ వినియోగంలో డిమాండ్ మరింత పెరుగుతుందని సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ ఆసియా సారథి లఫర్గీ హోల్సిమ్ వ్యాఖ్యానించారు.