ETV Bharat / state

తెదేపా సానుభూతిపరుడిని అరెస్ట్​ చేసిన సీఐడీ పోలీసులు

తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ జూన్​ 20న కిషోర్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. జూన్​ 23న తెల్లవారుజామున పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Jun 23, 2020, 2:26 PM IST

cid arrest nalanda kishore
తెదేపా సానుభూతిపరుడిని అరెస్ట్​ చేసిన సీఐడీ పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పోస్టులను ఫార్వర్డ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. నలంద కిశోర్ అనే వ్యక్తిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నంలోని సీబీఎం కాంపౌండ్​లోని ఆయన నివాసంలో సీఐడీ అదుపులోకి తీసుకుంది.

ఆరోగ్యం సరిగా లేదని.. ఉదయం వస్తానని చెప్పినా.. పోలీసులు వినలేదని కిషోర్ బంధువులు తెలిపారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకి నలంద కిషోర్ అనుచరుడు కావడం వల్ల ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రచారంలో ఉన్న పోస్టులను నలంద కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.