సమాజంలో అన్ని మతాలను గౌరవించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరింంచుకుని అమీర్పేట్ డివిజన్ వివేకానంద కమిటీహాల్లో పేద ప్రజలకు కానుకలను అందించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఎదురైన కష్టాలను మరిచిపోయి క్రిస్మస్ను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషకుమారి, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.