టీపీసీసీ నూతన అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(tpcc president revanth reddy)ని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి(AICC secretary Chinna Reddy) మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్‌రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్(ponnala lakshmaiah)లోని ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పొన్నాల.. రేవంత్‌కు శాలువా కప్పి ఆహ్వానించారు.
అపోలో ఆసుత్రిలో ఉన్న వీహెచ్‌ను రేవంత్ పరామర్శించనున్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో వీహెచ్ చికిత్స పొందుతున్నారు. అనంతరం పీవీ జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి... కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ పగ్గాలను అప్పగించింది. ఆరుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 10 మంది ఉపాధ్యక్షులు సహా.. ప్రచార, ఎన్నికలు, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేవంత్ సీనియర్లను కలిసి తమ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అభ్యంతరాలను పక్కనపెట్టి అందరనీ కలుపుకుంటూ పోతామని రేవంత్ అన్నారు. 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: డీలా పడ్డ కాంగ్రెస్‌కు.. రేవంత్ టీం దిక్సూచిగా మారేనా?