సమాజానికి అవసరమయ్యే సేవలను ప్రభుత్వాలు కొంతమేరకు అందిస్తాయని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో పద్మ మోహన ఆర్ట్స్ సంస్థ 30వ వార్షికోత్సవం ఘనంగా చేశారు. సంస్థ ఆధ్వర్యంలో పది మంది నిరుపేద విద్యార్థులకు, స్టేజ్ ఆర్టిస్టులకు నగదు పురస్కారం అందించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తతో కలిసి ఆయన పాల్గొన్నారు.
హోలీ పర్వదినం సందర్భంగా...
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరి జీవితలల్లోనైనా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. సమాజంలో మంచిని ప్రోత్సహించే వారికి లాభం చేకూరుతుందని అన్నారు. మాధవ సేవతో పాటు మానవా సేవా చేయాలన్నారు. దైవం విషయంలో భయం కంటే భక్తితో మెలగాలని... అప్పుడే మంచి పనులు చేయవచ్చునని ఆయన వెల్లడించారు.