ETV Bharat / state

Chinnareddy: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి - ఛైర్మన్‌గా చిన్నారెడ్డి

రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలియచేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Chinna reddy
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి
author img

By

Published : Nov 3, 2021, 10:50 PM IST

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా మాజీ మంత్రి చిన్నా రెడ్డి, వైస్‌ ఛైర్మన్​గా ఎం.ఎ.ఖాన్‌లు నియమితులయ్యారు. సభ్యులుగా సీనియర్‌ నేత ఎ.శ్యామ్‌ మోహన్‌, మాజీ మంత్రి గడ్డం వినోద్‌, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌ రావు, సీనియర్‌ సీజే శ్రీనివాస రావులను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా కొనసాగిన కోదండ రెడ్డి రాజీనామా చేయడంతో... కొత్త కమిటీ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్రమశిక్షణ సంఘం కమిటీకి చెందిన వివరాలను ఏఐసీసీకి నివేదించగా ఆ మేరకు అధిష్ఠానం ఆమోద ముద్ర వేసింది.

ఇదీ చూడండి:

Mla Jagga Reddy : దీపావళి పండుగపై ఒట్టేసి చెబుతున్నా.. ఇక అట్ల మాట్లాడను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.