ETV Bharat / state

ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. ప్రారంభించిన చిన్నజీయర్ - one rupee consultation

Chinna Jeeyar Swamy at Hospital : ఇటీవల కాలంలో వైద్యం చాలా ప్రియంగా మారిన తరుణంలో రామ్​నగర్​లో ఒక్క రూపాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ఆస్పత్రిని సందర్శించారు. అతి తక్కువ ధరకు వైద్య సేవలందించడాన్ని ఆయన అభినందించారు.

Chinna Jeeyar Swamy at Hospital, 1 RS consultation
ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్
author img

By

Published : Feb 26, 2022, 12:21 PM IST

Chinna Jeeyar Swamy at Hospital : ఆరోగ్యం.. ఆహారం.. లేకుండా జీవితమే లేదని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. డి.గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్​లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.

పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా... చిన్నజీయర్ స్వామికి ఆస్పత్రి నిర్వాహకులు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'రూ.225 కోట్ల ఆస్తులిస్తాం... మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.