ETV Bharat / state

Chinna jeeyar swamy : సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌ అసమానత: చినజీయర్‌ స్వామి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Chinna jeeyar swamy : సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌ అసమానత అని చినజీయర్‌ స్వామి అన్నారు. మనిషిలోని అంతర్గత వైరస్‌ తొలగించేందుకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు దోహదపడుతాయని వివరించారు. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.

Chinna jeeyar swamy, ramanujacharya sahasrabdi
సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌ అసమానత: చినజీయర్‌ స్వామి
author img

By

Published : Jan 31, 2022, 5:14 PM IST

సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌ అసమానత: చినజీయర్‌ స్వామి

Chinna jeeyar swamy : ఆధ్యాత్మిక వేత్త, ధార్మిక సంస్కర్త రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతాయని చినజీయర్‌ స్వామి తెలిపారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడి సహస్రాబ్ది ఉత్సవాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతామన్నారు. 1035 కుండాలతో శాస్త్రీయ, వైదిక విధానాలతో యాగం నిర్వహిస్తామని వెల్లడించారు.

'ఆధ్యాత్మిక వేత్త, ధార్మిక సంస్కర్త రామానుజాచార్యులు. సాంఘిక విప్లవాన్ని సమాజానికి అందించిన మహనీయులు. ఆయన సమతాస్ఫూర్తికి ఆకారం ధరించిన మూర్తి. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు. సహస్రాబ్ది ఉత్సవాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతాం.'

-చినజీయర్‌ స్వామి

లోపలి అహంకారం వల్లే ఈ రుగ్మతలు

సమాజాన్ని పట్టి పీడిస్తున్న వైరస్‌ అసమానత అన్న చినజీయర్‌ స్వామి... ప్రస్తుతం కుటుంబంలోని వ్యక్తులు పరస్పర గౌరవానికి నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నాడని చెప్పారు. మనిషిలోని అంతర్గత వైరస్‌ తొలగించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. సమాజంలో వివిధ రకాల విశ్వాసాలు, హెచ్చుతగ్గులున్నాయని... వీటి ఆధారంగా పాలన, ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మనిషి లోపలి అహంకారం వల్లే ఈ రుగ్మతలు నెలకొన్నాయని చినజీయర్‌స్వామి వివరించారు.

'బయటి జబ్బులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. మనసుల్లో వ్యాపించే వైరస్‌ను తగ్గించే వ్యాక్సిన్‌ కావాలి. వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులస్వామి వ్యాక్సిన్‌ అందించారు. రామానుజాచార్యులస్వామి సమానత వ్యాక్సిన్‌ అందించారు. సమాజంలో వివిధ రకాల విశ్వాసాలు, హెచ్చుతగ్గులున్నాయి. హెచ్చుతగ్గుల ఆధారంగా పాలన, ఆధిపత్యం చెలాయించే పరిస్థితి నెలకొంది. మనిషి లోపలి అహంకారం వల్లే ఈ రుగ్మతలు.'

-చినజీయర్‌ స్వామి

సమతాస్ఫూర్తి ఒక మందు

ప్రకృతిని, జంతువుల ఉనికిని మనిషి నాశనం చేస్తున్నాడని చినజీయర్‌స్వామి అన్నారు. మానవసేవ మాత్రమే మాధవ సేవ కాదని స్వామి చెప్పారని... నీళ్లను కాపాడు, భూమిని కలుషితం చేయకు తెలిపారని వివరించారు. సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరమన్న చినజీయర్‌స్వామి....సమాజంలో ఉన్న స్థితికి సమతాస్ఫూర్తి ఒక మందు అని వివరించారు. సర్వప్రాణి సేవ నినాదంగా రామానుజచార్యులు ముందుకు సాగారని వివరించారు.

'ప్రకృతిని, జంతువుల ఉనికిని మనిషి నాశనం చేస్తున్నాడు. మానవసేవ మాత్రమే మాధవ సేవ కాదని స్వామి చెప్పారు. నీళ్లను కాపాడు, భూమిని కలుషితం చేయకు అన్నారు. సర్వప్రాణి సేవ నినాదంగా స్వామి ముందుకు సాగారు. కర్ణాటకలో కరవు వస్తే జలాశయం ఏర్పాటు చేశారు.'

-చినజీయర్‌ స్వామి

ఇదీ చదవండి: Sri Ramanujacharya Statue: 'తొలుత తమిళనాడులోనే ఏర్పాటు చేయాలనుకున్నాం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.