ETV Bharat / state

కోట్ల రూపాయలను దర్జాగా ఛైనాకు తరలించారు.. - ts news

రంగులు చెప్పండి... లక్షలు గెలవండి అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగ్ ద్వారా యువకులు, విద్యార్థులను ఆకర్షించి వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల తెరవెనుక అక్రమాలను సైబర్ క్రైమ్ పోలీసులు వెలికి తీస్తున్నారు. డోకీ పే, లింక్​యున్ సంస్థల్లో గుర్తించిన 1100 కోట్ల నగదు లావాదేవీలు రెండు లక్షల ఖాతాల్లో ఉన్నాయని పోలీస్ అధికారులు గుర్తించారు.

china online betting case update
కోట్ల రూపాయలను దర్జాగా ఛైనాకు తరలించారు..
author img

By

Published : Sep 1, 2020, 7:44 AM IST

ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా నిందితులు కోట్ల రూపాయలను దర్జాగా చైనాకు తరలించారు. పందేల ద్వారా వచ్చిన సొమ్మును హవాలా మార్గంలో పంపేందుకు అనుమానం రాకుండా మంత్రాంగాన్ని నడిపారు. నగదును వివిధ రాష్ట్రాల నుంచి ఇనుము, వెండి, జుత్తు, ఆయుర్వేద మందులు, పైపులు, విడిభాగాల వంటివి బీజింగ్, హాంకాంగ్ సహా ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. దిగుమతి చేసుకున్న కంపెనీలు చెల్లించాల్సిన సొమ్మును దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డోకీ పే, లింక్ యున్ సంస్థలు చెల్లించాయి.

ఇది హవాలా సొమ్మేనని పోలీసులకు ఆధారాలు లభించడం వల్ల సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. క్షౌరశాలల నుంచి జుత్తును సేకరించి తరచూ చైనాకు పంపుతున్న ఓ డీలర్ ఎల్బీనగర్ లో ఉంటున్నాడు. రెండు మూడేళ్ల నుంచి చైనాకు జుత్తును పంపుతున్నాడు. జుత్తు సేకరణ ఆధారంగా పదిహేను రోజులు లేదా నెలకోసారి చైనాకు పార్సిల్ చేస్తున్నాడు. జుత్తు నాణ్యత ఆధారంగా అతడికి చైనా కంపెనీలు డబ్బు పంపుతున్నాయి.

బెట్టింగ్​ ద్వారా వచ్చిన సొమ్ము డీలర్​ ఖాతాలో..

డోకీ పే , లింక్​యున్ సంస్థల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశోధిస్తున్న ఎస్సై మదనకు ఎల్బీనగర్ డీలర్ ఖాతాలో జమ అయిన 82 లక్షల రూపాయలు అనుమానం కలిగించాయి. జుత్తును తీసుకున్న చైనా కంపెనీ నేరుగా అతడి ఖాతాకు కాకుండా చైనాలోని ఓ కంపెనీలో జమ చేయగా... అక్కడి నుంచి డోకీ పే, లింక్​యున్ సంస్థలకు సమాచారం అందింది. ఈ రెండు సంస్థలు బెట్టింగ్ ద్వారా వచ్చిన సొమ్మును ఎల్బీనగర్ డీలర్​ ఖాతాలో జమ చేశారు. జుత్తు ఎగుమతి చేసినందుకు ఆయనకు డబ్బు ముట్టింది. అయితే... దాన్ని రెండు కంపెనీలు హవాలాగా మార్చాయి.

మెట్రో నగరాల్లోనే కాదు..

హవాలా దందా కొనసాగిస్తున్న డోకీ పే, లింక్​యున్​ సంస్థలు మెట్రో నగరాల్లోనే కాదు... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లోని కంపెనీలు, వ్యక్తులను తమ హవాలా రాకెట్​లో కలుపుకున్నాయి. రెండు లక్షల ఖాతాల్లో కొన్ని వందల ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలించారు. శ్రీకాకుళం, విజయవాడ, రాజమండ్రి, కరీంనగర్‌లోని కంపెనీలు, వ్యక్తుల ఖాతాల్లోకి డోకీ పే, లింక్​యున్ సంస్థల నుంచి కోట్లలో నగదు జమ అయింది. శ్రీకాకుళంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఒక కంపెనీ ఖాతాలో కోటి, విజయవాడ, రాజమండ్రిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న కంపెనీలకు చెరో రెండు కోట్ల హవాలా సొమ్ము జమయ్యింది. కరీంనగర్‌లో చైనాకు సరుకు పంపుతున్న ఓ వ్యాపారి ఖాతాకు రూ 150 కోట్లు నిందితులు పంపించారని సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంతమందికి హవాలా సొమ్ము చేరిందో విచారణ బృందం పరిశీలిస్తోంది.

ఇవీ చూడండి: సినీ ఫక్కీలో కిడ్నాప్..​ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.