ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన చినజీయర్.. సమారోహ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం

China Jiyar Meets Governor Tamilisai: ముచ్చింతల్​లోని ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

China Jiyar  Meets Governor Tamilisai:
గవర్నర్​ను కలిసిన చినజీయర్
author img

By

Published : Jan 25, 2022, 2:16 PM IST

Updated : Jan 25, 2022, 2:43 PM IST

China Jiyar Meets Governor Tamilisai: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసైని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజా చార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు మహోత్సవాలు నిర్వహిస్తున్నామని గవర్నర్‌కు వివరించారు.

సమతామూర్తి పేరిట 214 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చినజీయర్ తెలిపారు. ఫిబ్రవరి 13న నిత్య పూజల కోసం 120కిలోల పుత్తడితో రూపొందించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు.

భారీ లోహ విగ్రహం..

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఏర్పాటైంది… శ్రీరామ నగరం. చిన్నజీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం... వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవం కల్పించేందుకు సిద్ధమైంది. వెయ్యేళ్ల క్రితమే... సమాజంలోని అందరూ సమానమే అంటూ, ఎక్కువ తక్కువలు లేవంటూ... సమతా భావనను అనుసరించిన మహా పురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు... ప్రయత్నిస్తోంది. రామానుజాచార్యులు కూర్చున్న భంగిమలో 214 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే... ఇందుకు సంబంధించిన చాలా పనులు పూర్తి కాగా... మరికొన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి.

ఆధ్యాత్మిక నగరం..

దివ్య సాకేతంలో రామానుజుల విగ్రహంతో పాటే... 108 దివ్య దేశాల్ని నిర్మించారు. వీటిలో శాంతి కణ్యాళాలు నిర్వహించనున్నారు... చిన్న జీయర్‌ స్వామి వారు. ఆ తర్వాతనే రామానుజ మూర్తి సహా... 108 ఆలయాల సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కాగా... ఆశ్రమానికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో... అన్ని మార్గాల్లో కొత్త రోడ్లు వేస్తున్నారు. ఉన్న వాటిని సరి చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక నగరం.. హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపు తెస్తుందని భావిస్తోంది.. తెలంగాణ ప్రభుత్వం. అందుకే... ఈ కార్యక్రమ బాధ్యతల్లో కొన్ని భుజానికెత్తుకుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సమతామూర్తి విగ్రహావిష్కరణ... కార్యక్రమంపై త్రిదండి చినజీయర్‌ స్వామితో చర్చించారు. ఇటీవలే ముచ్చింతల్‌లోని దివ్య సాకేతాన్ని సందర్శించిన ఆయన...ఇక్కడి ఏర్పాట్లుపై అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్​ను కలిసిన చినజీయర్

ఇదీ చూడండి: బడ్జెట్​పై సామాన్యుల భారీ ఆశలు- పన్ను రేట్లు తగ్గుతాయా?

Last Updated : Jan 25, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.