ETV Bharat / state

పిల్లలు కోరుకున్నది వెంటనే పొందాలి.. ఎవరేం చెప్పినా వినరు..! - పిల్లలకు క్రీడలు అలవాటు చేయ్యాలి

Children should get what they want immediately: పిల్లల్లో కోరుకున్నది వెంటనే పొందాలనే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లకి కావలసినది ఇచ్చేవరకు వదిలిపెట్టరు. వీరికి ఎక్కువగా కథల పుస్తకాలు చదివి వినిపించడం అలవాటు చేయ్యాలి. పిల్లల ప్రవర్తనకు భయపడి వారడిగిన ప్రతిదాన్నీ అందించకూడదు. అలా అందిస్తే వారి డిమాండ్స్ మరింత పెరుగుతాయి.

Childrens
Childrens
author img

By

Published : Nov 1, 2022, 11:41 AM IST

Children should get what they want immediately: చిన్నారులకు కోరింది వెంటనే చేతికి రావాలనే మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఇచ్చేవరకు పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు అసహనాన్ని ప్రదర్శిస్తారు. అనుకున్నది దొరకనప్పుడు కోపమెక్కువై దాన్ని ఎదుటి వారిపై చూపించే ప్రమాదం ఉంది. లేదంటే నిరాశలోకి జారిపోతారు. కొన్నిసార్లు కోరింది చేతికందనప్పుడు వారి కోపం దుఃఖంగా మారుతుంది. స్వీయనియంత్రణ కోల్పోతారు. ఎవరేం చెప్పినా వినరు. చిన్నప్పుడే ఈ లక్షణాల్ని నియంత్రించగలగాలి. లేదంటే అది వారితో పాటు పెరిగి పెద్దదవుతుంది.

క్రీడలు: పిల్లలను క్రీడల్లో ప్రవేశపెడితే ఓటమి, తిరిగి గెలవడానికి ప్రయత్నించడం, ఏకాగ్రత, పట్టుదల వంటివి అలవడతాయి. ఈ నైపుణ్యాలన్నీ వారిలో కావాల్సింది వెంటనే దొరకనప్పుడు అసహనాన్ని తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించడాన్ని నేర్పుతాయి. అందరిలో తామూ ఒకరమనే భావన అలవాటవుతుంది. బృందంతో కలిసి ఆడటం, తన ఆలోచనను ఎదుటివారితో పంచుకోవడం నేర్చుకుంటారు. ఏది సరైనదో తెలుసుకొనే అవగాహన పెరుగుతుంది.

పుస్తక పఠనం: కథల పుస్తకాలు చదివి వినిపించడం అలవాటు చేస్తే, క్రమేపీ వారికిష్టమైన రచనలను ఎంచుకుంటారు. చదవడం ద్వారా పిల్లల్లో తమని తాము అర్థం చేసుకోవడం మొదలవుతుంది. వారి లోపాలు వారికే తెలుస్తుంటాయి. అసహనం, కోపం, ఎదుటి వారిపై విసుగు ప్రదర్శించడం, అరవడం వంటి పనులన్నీ నెమ్మదిగా మానేస్తారు. పుస్తక పఠనం చిన్నారుల్లో ఎన్నోరకాల జీవన నైపుణ్యాలను అందిస్తుంది.

ప్రోత్సహించొద్దు: పిల్లల ప్రవర్తనకు భయపడి వారడిగిన ప్రతిదాన్నీ అందిస్తే అక్కడితో వారి డిమాండ్స్‌ ఆగవు. ప్రతి చిన్న విషయానికీ అసహనం పెరుగుతూనే ఉంటుంది. లేదా దాన్ని మరిపించడానికి మరొక అలవాటును అలవరచకూడదు. ఒంటరిగా పెరిగే పిల్లల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. క్రమేపీ వారి మార్గాన్ని మళ్లిస్తూ ఇతరులతో కలిసేలా చేయగలిగితే చాలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.