ETV Bharat / state

నేరస్థులైనా వారిదీ అమ్మమనసే కదా..!

నేరస్థులైనా వారిదీ అమ్మమనసే. ఆవేశంలోనో.. తెలిసీ, తెలియకో చేసిన తప్పుల కారణంగా జైలు గూటికి చేరుతున్న ఎంతోమంది మహిళలు తమ బిడ్డలకు తల్లి ప్రేమను పంచలేకపోతున్నారు. ఇలాంటి తల్లుల వెంట ఉండే చిన్నారుల పరిస్థితి ఏమిటి? తాము చేయని తప్పునకు తల్లితోపాటే పంజరంలో మగ్గిపోయే పసివాళ్ల కష్టాలేమిటనేది ఆసక్తికరమైన అంశం. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఇలాంటి చిన్నారుల పరిస్థితిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఇటీవల అధ్యయనం చేసి తల్లీ బిడ్డల దుస్థితిని వెలుగులోకి తెచ్చింది.

ncpcr survey report
ncpcr survey report
author img

By

Published : Apr 14, 2021, 6:35 AM IST

సాధారణంగా మహిళా ఖైదీలెవరికైనా అయిదేళ్ల లోపు వయసున్న పిల్లలుంటే వారిని తల్లి వెంటే జైల్లో ఉండడానికి అనుమతిస్తారు. ఒకవేళ 6-14 ఏళ్ల పిల్లలు ఉండి.. సంరక్షకులు ఎవరూ లేనప్పుడు ఆ చిన్నారులను జైలుకు అనుబంధంగా ఉండే బాలల సంరక్షణ కేంద్రాల్లో (సీసీఐ) ఉంచుతారు. అక్కడే వారికి చదువు నేర్పిస్తూ పసి మనసులపై జైలు వాతావరణ ప్రభావం పడకుండా చూడాలి. వారానికోసారి వారిని తల్లి వద్దకు తీసుకువచ్చి చూపించాలని.. దీనివల్ల తల్లి, పిల్లల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు సూచించింది.

వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ వెల్లడించింది. చాలాచోట్ల మహిళా ఖైదీలకు నెలల తరబడి పిల్లలను కలిసే అవకాశం దక్కడం లేదు. ములాఖత్‌ అనుమతుల్లో జాప్యం, సంరక్షణ కేంద్రాల నిర్లక్ష్యం వల్ల తల్లీ బిడ్డల కలయికే గగనమైపోతోంది.

ఎక్కడెక్కడ పరిశీలించారు?

‘దేశంలో మహిళా ఖైదీల పిల్లల విద్య’పై దేశవ్యాప్తంగా మచ్చుకు 8 మహిళా జైళ్లలో ఖైదీలు, జైలు అధికారులు, బాలల సంరక్షణ కేంద్రాలు, ఉపాధ్యాయులు, సీసీఐల్లోని చిన్నారులపై ఎన్‌సీపీసీఆర్‌ సర్వే చేసింది. దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడప, రాజమండ్రి జైళ్లను పరిశీలించింది. మహిళా ఖైదీలకు వారి పిల్లల భవిష్యత్తు, విద్యాప్రగతిపై అధికారులు, సంరక్షణ కేంద్రాలు సమాచారమైనా ఇవ్వడం లేదని వెల్లడైంది. బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లల్ని తోటి విద్యార్థులు హేళన చేస్తుంటారని నివేదిక వెల్లడించింది.

ఏం చదువుతున్నారో ఏమో..

పిల్లలు ఏం చదువుతున్నారో కూడా జైలు అధికారులు తల్లులకు చెప్పడం లేదు. ‘‘సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలను జైలుకు తీసుకువచ్చినపుడు వారు ఏం చదువుతున్నారంటూ తల్లులు ఆత్రుతగా అడుగుతుంటారు. కాని చిన్నారి వెంట వచ్చే సామాజిక కార్యకర్త నోటిమాటలతో వివరాలు చెప్పడం మినహా విద్యార్థి ప్రగతి నివేదిక ఇవ్వడం లేదు’’ అని సర్వే వెల్లడించింది. కొందరు మహిళా ఖైదీలు తమ పిల్లలకు సరైన సంరక్షణ చర్యలు, సదుపాయలు అందడంలేదని వాపోయారని వివరించింది.

అధ్యయనంలో వెల్లడైన అంశాలు..

* మహిళా ఖైదీలు తమ పిల్లలు పంజరంలో మాదిరి తమతో పాటే ఉండాలని కోరుకోకున్నా 0-6 ఏళ్ల వయసులో తల్లిపై ఆధారపడే చిన్నారులు కూడా జైళ్లలోనే జీవితాలను గడుపుతున్నారు.
* నేరస్థుల మధ్య.. సరైన విద్య, ఆహారం, సౌకర్యాలు లేని వాతావరణంలో పెరగడంతో పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* సంరక్షణ కేంద్రాల్లో చిన్నారుల విద్యాప్రగతిపై వాలంటీర్లు, జైలు అధికారులు వారి తల్లులకు ఎలాంటి ప్రగతి నివేదికలు ఇవ్వడం లేదు.
* పిల్లలను చేర్పించిన సంరక్షణ కేంద్రాల నుంచి పాఠశాలలు దూరంగా ఉన్నాయి. వారికి సంరక్షణ గృహాలు రవాణా సదుపాయాలు కల్పించడం లేదు.
* ఎదిగే వయసులో జైల్లో ఖైదీల మధ్య, పంజరం లాంటి వాతావరణంలో పెరగడంతో పిల్లల మానసిక స్థితి, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఏడాదికోసారి కష్టమే..

బాలల సంరక్షణ గృహాలకు చేరిన మహిళా ఖైదీల పిల్లలను వారానికోసారి తల్లితో మాట్లాడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనివల్ల తల్లి, పిల్లల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందని వివరించింది. పిల్లలను చేర్పించిన సంరక్షణ కేంద్రాలు నగరానికి దూరంగా లేదా ఇతర నగరాల్లో ఉండటంతో తీసుకురావడం కష్టమవుతోంది. సీసీఐల దరఖాస్తులకు ఒక్కోసారి అనుమతి లభించడం లేదు. కొన్నిసార్లు జైలు అధికారులు ఆలస్యం చేస్తున్నట్లు వెల్లడైంది. కొన్ని కేంద్రాలు నెలకోసారి, మూడునెలలకోసారి పిల్లలను తీసుకువస్తుండగా.. కొన్ని కేంద్రాలు అసలు తీసుకురావడమేలేదని వెల్లడైంది.

ఇదీ చూడండి: రూపు మార్చుకున్న బెట్టింగ్​.. ఆన్‌లైన్‌ యాప్‌లు, ఫేక్​ జీపీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.