ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. సంస్థలో మార్పులు చేస్తే.. సెక్షన్ 102 ప్రకారం కార్మికులకు తెలపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. చట్టం ప్రకారం మార్పులను గెజిట్‌లో ప్రచురించాలన్నారు. ప్రతిపాదిత మార్పులు స్థానిక దిన పత్రికల్లో ప్రచురించాలని కోర్టుకు విన్నవించారు.
ఆర్టీసీ ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కుట్ర పన్నుతున్నారని వాదించిన్నట్లు ప్రభాకర్ తెలిపారు. కార్మికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కోరారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపాలని కోర్టు ఆదేశించేలా ప్రయత్నిస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య