వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సన్మానసభలను ఘనంగా, సమన్వయంతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు ఏర్పాటు చేసిన సన్మానసభకు సీఎస్ అధ్యక్షత వహించారు. పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించిన సోమేశ్ కుమార్... వారు అందించిన సేవలను కొనియాడారు.
వారిని గౌరవ ప్రదంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి సాగనంపాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వ వాహనాల్లో వారి ఇంటికి సాగనంపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్ కుమార్