BRS Meeting in Aurangabad Today: మహారాష్ట్రలో మూడో బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సర్వం సిద్ధం చేసింది. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఔరంగబాద్‌లో అడుగు పెడుతోంది. ఔరంగబాద్‌లోని జబిందా మైదానంలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సభకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ తరహా అభివృద్ధి: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ కసరత్తు చేశారు. బహిరంగ సభలను నిర్వహించే ఘనంగా బీఆర్ఎస్.. ఔరంగబాద్ సభకూ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సభ వేదికతో పాటు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఔరంగబాద్‌లో పలు ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రతో పాటు దేశమంతటా అత్యవసరని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చేస్తోంది. సన్నాహక సమావేశాల్లోనూ అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు.
BRS Third Public Meeting in Maharashtra: రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్, దళితబంధు వంటివి.. మనకు ఎందుకు వద్దు అంటూ మహారాష్ట్రలో ప్రజలను కదిలిస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వివిధ పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు బీఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఔరంగబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ సహా పలువురు నాయకులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రతీరోజూ కొందరు చేరేలా ప్రణాళికలు వేశారు.
BRS Public Meeting in Aurangabad Today: బీఆర్ఎస్లో చేరేందుకు మహారాష్ట్ర నేతలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్న సంకేతాన్ని పంపేలా వ్యూహ రచన చేశారు. ఇవాళ్టి సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత సభల్లో జాతీయ, మహారాష్ట్ర అంశాలపైనే ఎక్కువగా ప్రస్తావించిన కేసీఆర్.. ఇవాళ ఔరంగబాద్‌లో అమిత్‌షా ఆరోపణలతోపాటు ఇటీవల రాష్ట్రంలోని పరిణామాలపై స్పందిస్తారా..? లేదా..? అనే చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: