బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారని హకీంపేట్ డిపో మేనేజర్ భాస్కర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 44 శాతం పీఆర్సీ ఇచ్చారని కొనియాడారు.
ఉద్యోగ భద్రత..
హైదరాబాద్ హకిీంపేట్ ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు మేనేజర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, యూకే కార్గో సర్వీసులను ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో, సమ్మె కాలం జీతాలు ఇవ్వడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.
రుణపడి ఉంటాం..
బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీకి వేతన సవరణ ప్రకటన చేయాలని ఉద్యోగుల తరపున గోపు శ్రీనివాస్ కోరారు. తామందరం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. సంస్థ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. సంస్థను లాభాల్లో తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సునీత, మెకానికల్ ఫోర్‌మెన్ రవికాంత్, ఆంజనేయులు, నాయకులు ఆర్ఆర్ రెడ్డి, నర్సింగ్‌రావు, సంజీవ, రవీందర్, తులసి రామ్, లక్ష్మీ, కవిత, నాగరాజు, మూర్తి, రఘు, విశాల్ యాదవ్, తమిళ్ వనం, మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని