ETV Bharat / state

CM KCR Mumbai Tour: ముంబయిలో కేసీఆర్.. మహారాష్ట్ర సీఎంతో లంచ్‌ భేటీ.. - తెలంగాణ వార్తలు

CM KCR Mumbai Tour : దేశ రాజకీయాల్లో సమూలమార్పే ధ్యేయంగా... కేంద్రంలోని భాజపా సర్కార్‌పై గళం విప్పుతున్న సీఎం కేసీఆర్... ముంబయికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయన... మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే ఇరువురు లంచ్ చేస్తూ... చర్చిస్తున్నారు.

CM KCR Mumbai Visit, Tour
హోటల్​లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ రాజ్
author img

By

Published : Feb 20, 2022, 11:30 AM IST

Updated : Feb 20, 2022, 2:43 PM IST

ముంబయికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

CM KCR Mumbai Tour : కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో... తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన కేసీఆర్... ఠాక్రేతో సమావేశమయ్యారు. ఠాక్రే నివాసంలో ఇరువురు సీఎంలు లంచ్‌ చేస్తున్నారు. భోజనం అనంతరం ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్​ కలవనున్నారు. కీలక చర్చల అనంతరం ఇవాళ రాత్రి 7.20 గంటలకు ముంబయి నుంచి సీఎం హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

CM KCR Mumbai Visit, Tour
ప్రత్యేక విమానంలో ఎంపీ రంజిత్​ రెడ్డితో కేసీఆర్

ముంబయిలో కేసీఆర్​ను కలిసిన ప్రకాశ్ రాజ్

ముంబయిలో ముందుగా గ్రాండ్ హయత్​ హోటల్​కు వెళ్లిన కేసీఆర్.. కాసేపటి క్రితం ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి చేరుకున్నారు. ముంబయి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను... గ్రాండ్ హయత్ హోటల్​లో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్​ కలిశారు. తనతో వచ్చిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్​ను ప్రకాశ్ రాజ్​కు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపు ముచ్చటించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన నేపథ్యంలో... అక్కడ భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు కలిసి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

CM KCR Mumbai Visit, Tour
హోటల్​లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ రాజ్

భాజపా సర్కార్ విధానాలపై చర్చ

దేశంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని భాజపా సర్కార్ విధానాలు... కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు... భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే చర్చిస్తున్నారు. ఇతర ముఖ్యమంత్రులు, నేతలతో జరుపుతున్న చర్చల సారాంశాన్ని... కేసీఆర్ వివరించనున్నారు. అనంతరం సిల్వర్‌ ఓక్‌ ఎస్టేట్‌కు వెళ్లి... ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారు. దేశంలో పరిస్థితులు, కేంద్రంలోని భాజపా సర్కార్ విధానాలు, రాజకీయస్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణ సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. రాత్రికి హైదరాబాద్‌..... తిరుగుపయనం అవుతారు.

CM KCR Mumbai Visit, Tour
ముంబయిలో భద్రత కట్టుదిట్టం

ఇదీ చదవండి: 3 ఖాతాల్లో రూ.1.28 కోట్లు జమ.. నాలుగు నెలల తర్వాత మేల్కొన్న బ్యాంక్ అధికారులు!

Last Updated : Feb 20, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.