ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల్లో మార్పులు, చేర్పులు..! ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు - బడ్జెట్ సమావేశాలపై కేసీఆర్ సమాలోచనలు

KCR
KCR
author img

By

Published : Jan 30, 2023, 4:12 PM IST

Updated : Jan 30, 2023, 5:16 PM IST

16:08 January 30

బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు

KCR on Telangana Budget Sessions 2023: బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో మంత్రులు, అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్​ రావు, ప్రశాంత్ రెడ్డి, అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, సంబంధిత అంశాలపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

Telangana Budget Sessions 2023 : బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఉభయసభలను వచ్చే నెల మూడో తేదీన మధ్యాహ్నం 12 గంటలా 10 నిమిషాలకు సమావేశపరుస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ సచివాలయం సమాచారం ఇచ్చింది. ఉభయసభల సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించాలంటే ఈ ఏడాది మొదటి సమావేశం కావాల్సి ఉంటుంది.

దీంతో అసెంబ్లీ, కౌన్సిల్​లను మొదట ప్రోరోగ్ చేసి ఆ తర్వాత తిరిగి సమావేశపరుస్తూ సమనింగ్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణయించిన తేదీ రోజు ఉభయసభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు లేదా మరో రోజు బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ మూడో తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అదే రోజు మొదట గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. వీటన్నింటికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అంతకుముందు హైకోర్టు సూచనలతో రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వ, అటు రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి కూడా అంగీకరించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. అలాగే, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతించనున్నట్లు రాజ్‌భవన్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 30, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.