లాక్డౌన్ అమలులో ఉన్నందున ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ.... ఇళ్లకే పరిమితమవ్వాలని కూకట్పల్లి ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్ ప్రజలను కోరారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని శిల్ప బృందావనం గృహ సముదాయం, ఎల్లమ్మ బండలోని ఖాజానగర్ తదితర బస్తీలలో కరోనా వైరస్ నియంత్రణకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. సామాజిక దూరం, కనీస శుభ్రత పాటించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితమై... కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు.
డివిజన్లోని అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై రసాయనాలతో స్ప్రే చేయిస్తున్నామని... ఎక్కడైనా కెమికల్స్ పిచికారి చేయనట్లు అనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చూడండి: జన్‌ధన్’ నగదు విత్‌డ్రా ఈ తేదీల్లోనే..