Cheating Lady Arrest in Hyderabad : అమ్మాయిలు అనగానే అణకువ, అమాయకత్వం, గౌరవం ఇలాంటి పదాలే గుర్తుకొస్తాయి. కానీ కొంత మంది కి'లేడీ'లు చేసే పనుల వల్ల వాటికి పూర్తి భిన్నంగా వారిపై ఆలోచన మారిపోతోంది. ఎవరైనా ఓ మహిళ, రోడ్డుపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగితే ఎవరైనా సరే ఎక్కించుకుంటారు. అయితే ఇలా లిఫ్ట్ అడిగి, ఎక్కించుకున్నాక వారికి అసలు సినిమా చూపించిందో కిలేడీ. తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే తనను అత్యాచారం చేశావని కేసు పెడతానంటూ బెదిరించి డబ్బులు లాగుతోంది.
ఇదే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న మహిళ పలువురిపై కేసుల వరకూ వెళ్లింది. ఎంత తెలివిగా చేసినా, ఏదో రోజు పాపం పండాల్సిందేగా. అలానే ఇవాళ ఆ కిలేడీ పాపం పండింది. రోజూ మాదిరిగానే ఓ వ్యక్తిని లిప్ట్ అడిగి బెదిరించింది. సీన్ కట్ చేస్తే, ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కిలేడిని పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
సైబర్ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం..
Syedanaeema Sultana Cheating Cases in Hyderabad : సుల్తానా(32) అనే ఓ మహిళ రోడ్డుపై వెళ్లేవారిని లిఫ్ట్ కావాలంటూ అడిగేది. లిఫ్ట్ ఇచ్చాక వాహనంలో ఎక్కిన తర్వాత మొదలవుతుంది అసలు కథ. తనపై అత్యాచారం(Lady Cheating to Rape Case) చేసేందుకు యత్నించావని కేసు పెడతానంటూ డబ్బులు డిమాండ్ చేసేది. కుదరకపోతే ఇంకో అడుగు ముందుకేసి దుస్తులు చించుకుని సదరు వాహనదారుడ్ని బెదిరించేది. తాను న్యాయవాదినంటూ వివిధ సెక్షన్ల కింద కేసులు పెడతానంటూ దబాయిస్తూ అందినకాడికి గుంజుకునేది.
న్యూడ్ కాల్స్‌తో బురిడీ.. రూ.లక్షలు లాగేసిన కిలేడి.. సాయం చేస్తానని 'పోలీసు' టోకరా
Cheating Woman Case in Hyderabad : తాజాగా జూబ్లీహిల్స్‌లో పరమానంద అనే వ్యక్తి కారులో వెళ్తుండగా జూబ్లీహిల్స్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు నిందితురాలు లిప్ట్ అడిగింది. కొంత దూరం వెళ్లిన తరవాత బట్టలు చించుకుని అత్యాచారం కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో కిలేడి వలపు వల.. ఆ తర్వాత నగ్న వీడియోలతో బెదిరిస్తూ..
నిందితురాలిపై నగరవ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిందని వెల్లడించారు. వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీ(Case Study Details) వివరాలు ఆమె వద్ద ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వాటిని అడ్డుపెట్టుకుని బాధితులను బెదిరిస్తున్నంని వివరించారు. ఈ క్రమంలోనే పలువురు అమాయకుల మీద ఈ కి'లేడీ' కేసులు పెట్టిందని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా ఈ కిలేడీ ఆటకట్టించిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు.