ETV Bharat / state

పనిచేసే దుకాణానికే కన్నం వేసి జైలుపాలైన ప్రబుద్ధుడు - గౌలిగూడలోని ఓ స్టేషనరీలో చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

పనిచేసే దుకాణానికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​ అఫ్జల్​గంజ్​లోని గౌలిగూడలో జరిగింది.

cheater-arrested-by-hyderabad-crime-police-in-afzalgunj
పనిచేసే దుకాణానికే కన్నం వేసి జైలుపాలైన ఓ ప్రబుద్ధుడు
author img

By

Published : Aug 8, 2020, 11:58 PM IST

తన అకౌంట్లో నుంచి తన ప్రమేయం లేకుండానే డబ్బులు దుబాయ్​కి ట్రాన్స్​ఫర్​ అయ్యాయని ఓ స్టేషనరీ దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్​ అఫ్జల్​గంజ్ గౌలిగూడలోని స్టేషనరీ దుకాణ యజమాని అయిన బాబు సింగ్​... తన అకౌంట్ నుంచి దుబాయ్​కి చెందిన ఓ అకౌంట్లోకి రూ. 4లక్షల 30 వేలు ట్రాన్స్​ఫర్​ అయ్యాయని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అదే దుకాణంలో పనిచేస్తున్న అకౌంటెంట్ ఎల్బీనగర్ నాగోల్​కు చెందిన భాస్కర్ బుచ్చిరాజు ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తెలింది. దుబాయ్​లో ఉండే తన మిత్రునికి యాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం పోలీసులు నిందితున్ని అరెస్ట్​ చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఇదీ చూడండి : 'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.