Changes In Amit Shah Visit To Hyderabad On March 11: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రతి 15రోజులకు ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పర్యటించాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనల్లో బీజేపీ అధిష్ఠానం మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న హైదరాబాద్కు రావలసిన కేంద్రమంత్రి అమిత్ షా.. మరుసటి రోజు సంగారెడ్డిలో జరగాల్సిన బీజేపీ మేధావుల సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఈనెల12న అమిత్ షా కేరళ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ ఈ నెల 11న రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా కలిసే అవకాశం ఉందని సమాచారం. మళ్లీ తిరిగి అమిత్ షా తెలంగాణ పర్యటన ఎప్పుడు ఉంటుందో.. తొందరలోనే ప్రకటించి.. షెడ్యూల్ను ఖరారు చేస్తామని బీజేపీ అధిష్ఠానం పేర్కొంది.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో అమిత్ షా పాల్గొంటారని.. అదీ ఏ పార్లమెంటు నియోజకవర్గంలో పాల్గొనే అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.. అయితే ఇప్పుడు పర్యటనలో మార్పులు చేశారు. గతంలో కూడా ఇలానే ఆదిలాబాద్ పర్యటనను చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. రాబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. బీజేపీ నాయకత్వం ఇక్కడ విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది.
ఈ ఎన్నికలు జరిగే వరకు ప్రతి నెల ఒక జాతీయ నాయకుడిని లేదీ కేంద్ర మంత్రిని ఒక్కో నియోజకవర్గానికి పంపించి.. స్థానిక నాయకులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కుల సంఘాలతో బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు భేటీలు నిర్వహించి.. బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా తగు ప్రణాళికలను సిద్ధం చేసి.. వాటిని ప్రయోగించారు.
తెలంగాణలో గెలిచి తీరాలి: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిచి తీరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా..జేపీ నడ్డాతో కలిసి నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఎన్నికలో వ్యవహరించాల్సిన ప్రణాళికలను, వ్యూహాలపై రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన చేరికలపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో సభలు పెట్టాలి కోరారు. తెలంగాణలో ప్రతి 15రోజులకు ఒకసారి పర్యటిస్తానని.. అందులో భాగంగానే ఈనెల 12న హైదరాబాద్కు వస్తానని చెప్పారు. అయితే సడెన్గా అమిత్ షా పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు.
ఇవీ చదవండి: