Chandrayan-3: ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీనికి సంబంధించిన మొదటి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో 75 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలో చంద్రయాన్-3 చిత్రాలను పొందుపరిచారు. చంద్రుని ఉపరితలంపై కాలుమోపనున్న ల్యాండర్, ఆదిత్య-ఎల్1 మిషన్‌లతోపాటు గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అందులో తెలియజేశారు.
ఇదీ చదవండి: ఆచార్య అలరించాడా? టాక్ ఎలా ఉందంటే..?