ETV Bharat / state

విశాఖ ఘటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ఏపీలో జరిగిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని.. ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లీకైనా స్టైరీన్​తో పాటు ఇతర వాయువులు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయన్న చంద్రబాబు.. దుర్ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు తెలుస్తాయన్నారు.

Chandrababu's letter to PM Modi
ఏపీ విశాఖ ఘటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : May 9, 2020, 9:30 AM IST

ఆంధ్రప్రదేశ్​లో జరిగిన విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్న చంద్రబాబు..దుర్ఘటనపై సత్వరమే స్పందించి చర్యలు చేపట్టినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు.

గ్యాస్ లీకేజిపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలన్నారు. లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతుందని...స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు చెబుతున్నాయని చంద్రబాబు అన్నారు.

గ్యాస్‌లీక్‌పై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్‌లో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుందన్నారు. దీర్ఘకాలంలో చూపే దుష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని లేఖలో చంద్రబాబు కోరారు.

ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.