ETV Bharat / state

Chandra Babu Chittoor Tour: నా సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా: చంద్రబాబు - Chandra Babu Chittor Tour

Chandra Babu Chittoor Tour: ఏపీలోని చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. సీఎం గాలిలో తిరుగుతారా అని నిలదీశారు. అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలన్నారు.

Chandra Babu Chittoor Tour, chadra babu tour, chandra babu comments
వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
author img

By

Published : Nov 24, 2021, 1:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన (Chandra Babu Naidu Chittoor Tour) కొనసాగుతోంది. వరద బాధితులకు మనో ధైర్యం ఇచ్చేందుకే తాను వచ్చానని చంద్రబాబు తెలిపారు. పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ఏంచేసిందని... ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం కలిగేదా? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దని... తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరద సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే... సీఎం గాలిలో తిరుగుతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలన్నారు.

అసెంబ్లీలో నా భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడారు. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉన్నా.. ఆమె బయటకు రాలేదు. 40 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా. అలిపిరిలో నా కారుపై మందుపాతర పేలినా భయపడలేదు. నా భార్యపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా. మీ కుటుంబంలో మహిళలకు ఇలా జరిగితే మీరు బాధపడరా?. కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశా. ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పా. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా. నేను కంపెనీలు తెస్తే.. వీళ్లు దందాలు చేస్తున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. ఎన్నో అక్రమాలు చేసి కుప్పం ఎన్నికల్లో గెలిచారు. తప్పుడు పనులు చేసేవాళ్లను అధికారంలోకి వచ్చాక వదిలేది లేదు. -చంద్రబాబు, తెదేపా అధినేత

జగన్‌కు ఏదో మానసిక సమస్య ఉంది...

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికలో వైకాపా నేతలు నానా రభస చేశారని చంద్రబాబు విమర్శించారు (Chandrababu Naidu Comments). కౌన్సిల్‌ హాల్లో కుర్చీలు, మైకులు విరగ్గొట్టారని మండిపడ్డారు. చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు. కొండపల్లి విషయంలో జగన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న చంద్రబాబు... తెదేపాకు చిన్న మున్సిపాలిటీ వచ్చినా తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇవన్నీ చూస్తుంటే జగన్​కు ఏదో మానసిక సమస్య ఉన్నట్టుందన్నారు.

ఇదీ చదవండి: Chandrababu Tour: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నేడు చిత్తూరులో పర్యటన

Chandrababu: ఎవరూ అధైర్యపడవద్దు..అండగా ఉంటాం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.